SBI కస్టమర్లకు దసరా బంపరాఫర్: పండుగ సీజన్లో లోన్లు చాలా చౌక
హోమ్, పర్సనల్, కారు లోన్స్ అతి తక్కువకు..
హోమ్ లోన్స్, కారు లోన్స్, పర్సనల్ లోన్స్‌తో ఈ పండుగను మరింత సంబరంగా జరుపుకోండని పేర్కొంది
హోమ్ లోన్ పైన కాంపిటేటివ్ ఇంటరెస్ట్ రేట్, కారు లోన్స్ పైన తక్కువ వడ్డీ, జీరో ప్రాసిసెంగ్ ఫీజు, యోనో ద్వారా అదనపు ప్రయోజనాలు, పర్సనల్ లోన్ పైన తక్కువ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు పైన 50 శాతం తగ్గింపు ఆఫర్లు ఉన్నట్లు పేర్కొంది
2
8.15 శాతం వడ్డీ రేటు.. షరతులు వర్తిస్తాయి!
మూడు రోజుల క్రితం కూడా హోమ్ లోన్ పైన ఎస్బీఐ ట్వీట్ చేసింది. 'SBi హోమ్‌లోన్‌తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటు విధానంలో హోమ్ లోన్ వడ్డీ రేటు 8.15% నుంచి ప్రారంభమౌతోంది. ఇప్పుడు మీరు సొంతిల్లు కలిగి ఉండొచ్చు. అక్టోబర్ 1 నుంచి ఈ రుణాలు అందుబాటటులోకి వస్తాయి' అని పేర్కొంది. 8.15 శాతం వడ్డీ రేటుకు షరతులు వర్తిస్తాయని కూడా పేర్కొంది
3
ఎస్బీఐ గుడ్ న్యూస్
ఈ నేపథ్యంలో పండుగ సీజన్లో హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్. ఎస్బీఐ రెపో రేటు ఆధారిత హోమ్ లోన్స్‌ను మళ్లీ ఆపర్ చేస్తామని ఇదివరకు చెప్పింది. అక్టోబర్ 1 నుంచి రుణాలు అందుబాటులోకి వస్తాయి. బ్యాంకు ఈ ఏడాది జూలై 1న ఈ రుణాలను ఆవిష్కరించింది. అయితే ఆ తర్వాత ఈ రుణాలను ఉపసంహరించుకుంది. ఇప్పుడు మళ్లీ వీటిని కొన్ని మార్పులతో కస్టమర్లకు అందించనుంది
0 Response to "SBI కస్టమర్లకు దసరా బంపరాఫర్: పండుగ సీజన్లో లోన్లు చాలా చౌక"
Post a Comment