తెలంగాణలో నలుగురు డీఈవోలకు జైలుశిక్ష

హైదరాబాద్‌: 1998 డీఎస్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో నలుగురు డీఈవోలకు తెలంగాణ హైకోర్టు జైలు శిక్ష విధించింది. 



కోర్టు ధిక్కరణ కేసులో డీఈవోలకు జైలు శిక్ష విధించింది. నల్గొండ, ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌లలో అప్పట్లో డీఈవోలుగా పనిచేసిన వారికి రెండు నెలలపాటు జైలు శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ

 ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ శిక్షపై అప్పీలుకు వీలుగా నాలుగు వారాల పాటు తీర్పు అమలును నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేసింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "తెలంగాణలో నలుగురు డీఈవోలకు జైలుశిక్ష"

Post a Comment