పదవ తరగతి పరీక్షల్లో సమూల మార్పులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదవ తరగతి పరీక్షల్లో భారీగా మార్పులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సంవత్సరం నుండి పదవ తరగతి పరీక్షల్లో బిట్ పేపర్ ను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బిట్ పేపర్ ఇవ్వకుండా ప్రశ్న పత్రంలోనే బహుళైచ్చిక ప్రశ్నలను ఇవ్వనున్నారు. ఇప్పటివరకు పదవ తరగతి విద్యార్థులు రాసిన ప్రశ్న పత్రాలతో పోలిస్తే ఈ సంవత్సరం నుండి ప్రశ్న పత్రం పూర్తిగా మారుతున్నట్లు తెలుస్తుంది.
విద్యాశాఖ నిన్న కొత్తగా రూపొందించిన ప్రశ్న పత్రాన్ని ప్రభుత్వానికి పంపినట్లు తెలుస్తోంది. పదవ తరగతి పరీక్షల్లో మార్పుల గురించి ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్లు తెలుస్తుంది
హిందీ సబ్జెక్టుకు తప్ప మిగతా సబ్జెక్టులకు రెండు పేపర్ల చొప్పున ఉంటాయి. గతంలో సబ్జెక్టులో 100 మార్కులకు 35 మార్కులు వస్తే ఉత్తీర్ణులు అయినట్లు ఉండేది. కానీ కొత్త విధానం ప్రకారం ప్రతి పేపర్ లోను 18 మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. జవాబు రాసే పేపర్లను కూడా బుక్ లెట్ విధానంలో ఇవ్వాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోందని తెలుస్తుంది.
కొత్త నమూనా ప్రశ్న పత్రం ప్రకారం ప్రశ్న పత్రంలోనే 12 అరమార్కు ప్రశ్నలు ఇస్తారని తెలుస్తోంది. ఖాళీలు, బహుళైచ్చిక ప్రశ్నలు, జతపరచటం చేయాల్సి ఉంటుందని సమాధానాలు జవాబు పత్రాలలో రాయాల్సి ఉంటుందని తెలుస్తోంది. 2, 3 లైన్లలో సమాధానాలు రాయాల్సిన ఒక మార్కు ప్రశ్నలు 8 ఉంటాయని తెలుస్తోంది. 4 మార్కుల ప్రశ్నలు 5, 2 మార్కుల ప్రశ్నలు 8 ఉంటాయని తెలుస్తోంది. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన తరువాత పదవ తరగతి పరీక్షల్లో ఈ మార్పులు జరుగుతాయి
0 Response to "పదవ తరగతి పరీక్షల్లో సమూల మార్పులు..."
Post a Comment