త్వరలో ఎస్‌బీఐ రూపే క్రెడిట్ కార్డు!
న్యూదిల్లీ: దేశీయంగా పేమెంట్స్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)రూపే క్రెడిట్ కార్డును తీసుకురానుంది. ప్రస్తుతం మార్కెట్‌లో యూఎస్ పేమెంట్స్ గేట్‌వేలైన వీసా, మాస్టర్‌కార్డ్‌లు హవా నడుస్తున్న నేపథ్యంలో ఎస్‌బీఐ ఈ దిశగా అడుగులు వేయనుంది. రూపేను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) అభివృద్ధి చేసింది. దీని ద్వారా రిటైల్‌గా చెల్లింపులు, లావాదేవీలు
జరుగుతున్నాయి. ''త్వరలోనే రూపే ఆధారిత క్రెడిట్‌కార్డును తీసుకొస్తాం. దీని అనుమతులకు సంబంధించి, ఎన్‌పీసీఐ వద్ద చివరి దశలో ఉన్నాయి. ఒక్కసారి ఎన్‌పీసీఐ నుంచి తుది అనుమతులు వస్తే, క్రెడిట్‌కార్డును వెంటనే ప్రారంభిస్తాం' అని ఎస్‌బీఐ కార్డు ఎండీ, సీఈవో హర్దయాళ్ ప్రసాద్ తెలిపారు
ప్రస్తుత త్రైమాసికంలోనే రూపే క్రెడిట్‌కార్డును తీసుకొస్తామని ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. 'ఇది చాలా చిన్న విషయం. ఒకసారి మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత ఇది చాలా పాపులర్ అవుతుంది. దేశవ్యాప్తంగా అత్యధికమంది వినియోగిస్తారు. అందులో ఎలాంటి అనుమానం లేదు' అని ప్రసాద్ తెలిపారు
0 Response to "త్వరలో ఎస్‌బీఐ రూపే క్రెడిట్ కార్డు!"
Post a Comment