పోలీస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌లో సవరణలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో
ఆంధ్రప్రదేశ్ పోలీస్ (ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్) సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌లో ప్రభుత్వం సవరణలు చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఉత్తర్వులను హోం శాఖ ముఖ్య కార్యదర్శి కెఆర్‌ఎం కిశోర్ కుమార్ శుక్రవారం జారీ చేశారు. రూల్-3లోని కేటగిరీ-1 పట్టికలో

సవరణలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సబ్ ఇన్స్‌పెక్టర్(టెక్నికల్) పోస్టులను భర్తీ చేసే విధానంలో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పది ఖాళీల్లో మొదటి, మూడో, ఐదో, ఏడో, తొమ్మిదో ఖాళీలను డైరెక్ట్
రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. రెండో, ఆరో, ఎనిమిదో, పదో ఖాళీలను హెడ్ కానిస్టేబుల్(డ్రైవర్)లకు పదోన్నతి కల్పించడం ద్వారా, నాల్గో ఖాళీని
హెడ్ కానిస్టేబుల్(మెకానిక్)లకు ఉద్యోగోన్నతి కల్పించడం ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు
ఈ సవరణల నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్‌లో గెజిట్‌లో ప్రచురించాలని ఆదేశించారు
0 Response to "పోలీస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌లో సవరణలు"
Post a Comment