వినూత్నం.. డ్యాన్స్ చేస్తూ పాఠాల బోధన
భువనేశ్వర్ : ప్రత్యేకమైన బోధనా పద్ధతుల ద్వారా చదువు చెప్పినప్పుడే విద్యార్థులకు త్వరగా అర్థమవుతుంది. ఆ పిల్లలు పాఠశాలకు రావడానికి కూడా మక్కువ చూపుతుంటారు. తద్వారా పాఠశాలలో హాజరు శాతం పెరిగి.. డ్రాప్ అవుట్స్ సంఖ్య తగ్గిపోతోంది. ఈ మూడింటిని సాధించడం కోసం ఓ టీచర్ వినూత్నంగా పాఠాలు బోధించడం మొదలు పెట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. ప్రఫుల్లా కుమార్ పాటి(56) అనే వ్యక్తి కోరాపూట్ జిల్లాలోని ఓ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. కోరాపూర్ జిల్లాలో ఎక్కువగా గిరిజనులు ఉంటారు. కాబట్టి వారిని చదువుకునేందుకు ప్రోత్సహించేందుకు ప్రత్యేకమైన బోధనా పద్ధతులను అమలు చేశారు. 2008 నుంచి పాఠాలను.
పాటలు, డ్యాన్స్‌ల ద్వారా నేర్పిస్తున్నారు ఆ ప్రధానోపాధ్యాయుడు. తాను డ్యాన్స్ చేస్తూ.. పిల్లలచే కూడా డ్యాన్స్ చేయిస్తున్నాడు. పాఠాలను పాటల రూపంలో బోధిస్తున్నాడు.
దీంతో పిల్లల్లో హుషారు వచ్చి చదువు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే మధ్యాహ్న భోజనం తర్వాత ఈ వినూత్న ప్రయోగాన్ని అమలు చేయడంతో.. విద్యార్థులు నిద్ర పోకుండా ఉండేందుకు, శారీరక ఎదుగుదలకు ఉపయోగపడుతుందని
దీంతో పిల్లల్లో హుషారు వచ్చి చదువు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే మధ్యాహ్న భోజనం తర్వాత ఈ వినూత్న ప్రయోగాన్ని అమలు చేయడంతో.. విద్యార్థులు నిద్ర పోకుండా ఉండేందుకు, శారీరక ఎదుగుదలకు ఉపయోగపడుతుందని
ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.. ఇక పద్ధతిని అవలంభించిన తర్వాత స్కూల్ డ్రాప్ అవుట్స్ సంఖ్య తగ్గిందన్నారు. మొత్తానికి ప్రఫుల్ కుమార్ పాటి సార్.. కోరాపూట్ జిల్లా ప్రజల, విద్యార్థుల హృదయాలను గెలుచుకున్నారు
0 Response to "వినూత్నం.. డ్యాన్స్ చేస్తూ పాఠాల బోధన"
Post a Comment