డూప్లికేట్ ఆధార్ పొందు విధానం

*✨ డూప్లికేట్ ఆధార్ పొందు విధానం*

★ ఆధార్ కార్డు పోయిన‌ట్టు అయితే ఎంతో సులువుగా డూప్లికేట్ ఆధార్ సంపాధించ‌వ‌చ్చు. అది ఎలాగో ఓ లుక్కేయండి..




★ ముందుగా పిసి బ్రౌజర్‌లో www.uidai.gov.in సైట్ ను ఓపెన్ చేసి Aadhar service సెక్షన్ ను ఓపెన్ చేయాలి. 

★ ఆ త‌ర్వాత‌ 'Retrieve Lost or Forgotten EID/UID' లింక్ ను ఓపెన్ చేసుకోవాలి.

★ ఆ త‌ర్వాత‌ పేజీలో అవసరమైన వివరాలను నమోదు చేయాలి. పేరు, మొబైల్ నంబర్,ఇ-మెయిల్ మరియు సిస్టమ్-జనరేటెడ్ సెక్యూరిటీ కోడ్ వంటి వ‌వ‌రాల‌ను ఎంట‌ర్ చేయాలి.

★ దీని త‌ర్వాత చేయాల్సింది ఏంటంటే మీరు EID (నమోదు సంఖ్య) లేదా UID (ఆధార్ నంబర్) ను తిరిగి పొందాలనుకుంటున్నారా అని నిర్దేశించండి.

★ ఒక‌సారి మీ వివ‌రాల‌న్నిటిని చెక్ చేసుకుని కింద ఉన్న Send OTPపై క్లిక్ చేయాలి. వెంట‌నే మీ మొబైల్ నెంబ‌ర్‌కు OTP వ‌స్తుంది. దాన్ని ఎంట‌ర్ చేసి మొత్తం చెక్ చేసుకోవాలి. 

★ చివ‌రిగా మొత్తం చెక్ చేసుకున్న త‌ర్వాత మీ ఇ-మెయిల్ మరియు మొబైల్ నెంబర్ కు ఆధార్ నెంబ‌ర్ వ‌స్తుంది.   


★ ఈవిధంగా ఆధార్ కార్డు పోయి ఉంటే ఎంతో సులువుగా డూప్లికేట్ ఆధార్ పొంద‌వ‌చ్చు.

              

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " డూప్లికేట్ ఆధార్ పొందు విధానం"

Post a Comment