లోక్‌సభకు కనీసవేతన చట్టం బిల్లు
దిల్లీ: వేతన చట్టంలోని నిబంధనలను క్రోడీకరించి కనీసవేతనానికి సంబంధించి న్యాయపరమైన రక్షణ కల్పించే బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర కార్మిక, ఉద్యోగకల్పనశాఖామంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రవేశపెట్టిన కనీసవేతన చట్టం-2019 ప్రకారం దేశమంతటా సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేసేవారందరు కూడా కనీసవేతనం పొందే చట్టపరమైన హక్కు కలిగిఉంటారని వెల్లడించారు. నెలరోజులు, వారం, రోజు ప్రాతిపదికన వేతనాన్ని పొందేవారు నిర్ణీత సమయానికి వేతనం పొందేలా
కఠినమైన చట్టాల్ని ఇందులో పొందుపరచామన్నారు. దీని ప్రకారం గడిచిన నెల జీతాన్ని ఆ తర్వాతి నెల 7 తేది కల్లా చెల్లించాలన్నారు
అలాగే వారం ప్రాతిపదికన చెల్లించేవారు ఆ వారాంతంలో, రోజూవారీ వారికి అదేరోజూ తప్పనిసరిగా యజమానులు వేతనాలు చెల్లించాలన్నారు. ఈ బిల్లు రూపొందించే ముందు అనేక సంస్థలను సంప్రదించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. కనీసవేతన చట్టం 1948, వేతనాల చెల్లింపు చట్టం 1936, అదనపు వేతన చెల్లింపు చట్టం 1965, సమాన వేతన చట్టం 1976 లలో ఉన్న నిబంధనలకు సవరణలు చేసినట్లు గంగ్వార్ వెల్లడించారు
0 Response to "లోక్‌సభకు కనీసవేతన చట్టం బిల్లు"
Post a Comment