ఎస్‌బీఐ కస్టమర్లకు మరో గుడ్ న్యూస్!
ప్రభుత్వ రంగ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కస్టమర్లకు ఓ గుడ్ న్యూస్ తెలిపింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఆదేశాల మేరకు ఎస్‌బీఐ ఇదివరకే నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ చార్జీలను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. స్టేట్ బ్యాంక్ ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ ద్వారా జరిపే ఐఎంపీఎస్ (ఇమీడియట్ పేమెంట్ సర్వీస్) లావాదేవీల చార్జీలను కూడా తొలిగిస్తామని ప్రకటించింది. తాజా నిర్ణయం 2019 ఆగస్ట్ 1 నుంచి అమలులోకి వస్తుందని ఎస్‌బీఐ తెలిపింది. ఐఎంపీఎస్ విధానంలో డబ్బులను రియల్ టైమ్‌లో అప్పటికప్పుడు ఇతరుల అకౌంట్‌కు పంపించొచ్చు. ఈ సేవలు 24 గంటలూ అదుబాటులో ఉంటాయి. ఇంటర్‌బ్యాంక్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ సేవలను మొబైల్, ఇంటర్నెట్, ఏటీఎం, ఎస్ఎంఎస్, బ్రాంచ్ లేదా యూఎస్ఎస్‌డీ మార్గాల్లో పొందొచ్చు.
ఇంటర్నెట్ బ్యాకింగ్, మొబైల్ బ్యాంకింగ్ రూపంలో ఐఎంపీఎస్ మార్గంలో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే ఎలాంటి చార్జీలు ఉండవు. అయితే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి డబ్బులు పంపాలంటే మాత్రం చార్జీలు పడతాయి. రూ.1,000లోపు డబ్బు బదిలీకి చార్జీలు ఉండవు. రూ.1,001 నుంచి రూ.10,000 వరకు డబ్బు బదిలీకి రూ.2, జీఎస్‌టీ చెల్లించాలి.
గతంలోనూ ఇవే చార్జీలు ఉన్నాయి. ఆగస్ట్ 1 నుంచి కూడా వీటిల్లో మార్పు ఉండదు. కానీ ఆగస్ట్ 1 నుంచి రూ.10,001 నుంచి రూ.25,000 వరకు మనీ ట్రాన్స్‌ఫర్‌కు రూ.4తోపాటు జీఎస్‌టీ (ఇప్పుడు రూ.2+ జీఎస్‌టీ) చెల్లించాలి. రూ.25,001 నుంచి రూ.1 లక్ష వరకు డబ్బులు పంపేందుకు కూడా రూ.4తోపాటు జీఎస్‌టీ (రూ.5+ జీఎస్‌టీ) కట్టాలి. ఇక రూ.1,00,001 నుంచి ఆపై డబ్బు బదిలీకి రూ.12తోపాటు జీఎస్‌టీ (ఇప్పుడు రూ.10+ జీఎస్‌టీ) పడుతుంది
0 Response to "ఎస్‌బీఐ కస్టమర్లకు మరో గుడ్ న్యూస్!"
Post a Comment