సీపీఎస్‌ రద్దుపై నీలినీడలు

🔳సీపీఎస్‌ రద్దుపై నీలినీడలు 
ఉద్యోగుల ఆశలపై కేంద్రం నీళ్లు 
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే కీలకం

సీపీఎస్‌ రద్దుపై నీలినీడలు 


ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం అమల్లో ఉన్న భాగస్వామ్య పింఛను విధానాన్నే (సీపీఎస్‌) కొనసాగిస్తామని, 2004కి ముందున్న పాత పింఛను విధానాన్ని (ఓపీఎస్‌)



 పునఃప్రవేశపెట్టే అవకాశమే లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానం ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. ఓపీఎస్‌ కోసం దీర్ఘకాలికంగా ఆందోళనలు, ఉద్యమాలు జరుగుతున్నా కేంద్ర నిర్ణయంలో మార్పు రాకపోవడంపై ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 



ఇదీ విధానం 
దేశంలో అయిదు దశాబ్దాలు కొనసాగిన పింఛను విధానం స్థానంలో కొత్త విధానాన్ని 2004 జనవరి నుంచి కేంద్రం అమల్లోకి తెచ్చింది. ఉద్యోగి వాటా, కేంద్రం వాటాను మార్కెట్లో పెట్టుబడిగా పెట్టి వచ్చే లాభాల ఆధారంగా పింఛను పథకాన్ని అమలు చేస్తున్నారు. ఉద్యోగులు జీతంలో పదిశాతాన్ని చెల్లిస్తుంటే, కేంద్రం లేదా రాష్ట్రం అంతే మొత్తాన్ని జమచేస్తోంది. సొమ్మును ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్‌ బాండ్లు, ఈక్విటీలలో పెడతారు. మూడేళ్ల కనీస వ్యవధి ఉంటుంది. వ్యవధి తీరిన తర్వాత వచ్చిన మొత్తంపై పన్ను రహిత భాగాన్ని కేంద్రం 40% నుంచి 60%కి పెంచింది. సెక్షన్‌ 80సి కింద పన్ను మినహాయింపు



 ప్రయోజనాన్ని రాష్ట్రంపైనే ఆశలు కేంద్రం నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో రాష్ట్ర నిర్ణయం కీలకంగా మారింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేస్తామని ప్రకటించింది. అమలు సాధ్యాసాధ్యాలపై ఒక కమిటీని నియమించింది. తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞాపనలు వచ్చినా దీనిపై ఇప్పటి వరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.   పొందటానికి అనుమతించింది. ఇటీవల బడ్జెట్‌లో కేంద్రం తన వాటాను 14 శాతానికి పెంచింది. కొత్త పింఛను విధానాన్ని మొదటి నుంచి ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. అనిశ్చితిలో ఉన్న మార్కెట్‌లో పెట్టుబడుల రూపేణా పింఛను సొమ్మును పెట్టడం భావ్యం కాదని వాదిస్తున్నారు. సీపీఎస్‌ రద్దు చేయాలని అనేక రాష్ట్రాలతో పాటు ఇక్కడా ఉద్యమాలు జరుగుతున్నాయి. 



వీరు సీపీఎస్‌ రద్దు కోసం అన్ని రాజకీయ పార్టీలను అభ్యర్థిస్తున్నారు. తెలంగాణలో భాజపా సీపీఎస్‌ రద్దుకు మద్దతు ఇచ్చింది. కానీ కేంద్రం తాజాగా ప్రస్తుత విధానం కొనసాగిస్తామనే స్పష్టం చేయడంతో ఉద్యోగులు నిరాశ చెందారు. దేశంలో ప్రస్తుతం ఈ పథకం కింద 40 లక్షల మంది ఉద్యోగులున్నారు.

కేంద్రం వైఖరి బాధాకరం 
దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఉన్నా కేంద్ర ప్రభుత్వం సీపీఎస్‌ రద్దుకు ముందుకు రాకపోవడం బాధాకరం. లక్షల మంది ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా కేంద్రం వ్యవహరించాలి. -కారెం రవీందర్‌రెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు
అధ్యయనం అవసరం  
సీపీఎస్‌ విధానాన్ని కేంద్రం పునఃసమీక్షించాలి. దీనివల్ల జరిగే పరిణామాలను పరిశీలించాలి. జాతీయ స్థాయిలో ఒక కమిటీ ద్వారా అధ్యయనం చేయించాలి. ఉద్యోగులకు ఏది మేలో దానిని అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సమస్య పరిష్కారానికి ముందుకు రావాలి. ఇప్పటికే ఉద్యోగ సంఘాల ఐకాస తరఫున సీఎంకు విన్నవించాం.  - వి.మమత, టీజీవో అధ్యక్షురాలు
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి 
సీపీఎస్‌ రద్దుపై కేంద్రం చేతులెత్తేసినందున రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాలి. ఈ విధానం ఉద్యోగులకు ఆర్థిక భరోసా లేకుండా చేస్తోంది. - పద్మాచారి, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సీపీఎస్‌ రద్దుపై నీలినీడలు"

Post a Comment