1 నుంచి ఓటర్ల నమోదు... ప్రత్యేక కార్యక్రమం
చిత్తూరు: ఏపీలో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ విడుదల చేశారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి బూత్ లెవల్ ఆఫీసర్లు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తిరిగి ప్రస్తుత ఓటర్ల జాబితా పరిశీలన, తప్పుల సవరణ చేపడతారు. సెప్టెంబరు ఒకటి నుంచి 30వ తేదీవరకు ఓటు నమోదుకు
అవకాశమిచ్చారు. వచ్చిన దరఖాస్తులను అక్టోబరు 15వ తేదీనాటికి విచారణ పూర్తిచేస్తారు. అలాగే 2020 జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు వయసు నిండే యువత అక్టోబరు 15 నుంచి నవంబరు 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 15వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నారు. జిల్లాలో ప్రస్తుతం 14 నియోజకవర్గాల పరిధిలో 31,83,187 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 15,71,116 మంది, మహిళలు 16,05,734, ఇతరులు 337 మంది ఉన్నారు
0 Response to "1 నుంచి ఓటర్ల నమోదు... ప్రత్యేక కార్యక్రమం"
Post a Comment