✍విద్యాదాన్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
*📚✍విద్యాదాన్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం*
*ఈనాడు, అమరావతి:*
అత్యుత్తమ ప్రతిభ కలిగి, వార్షికాదాయం రూ.2 లక్షల్లోపు ఉన్న విద్యార్థులకు సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యాదాన్ ఉపకార వేతనాలు అందించనున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు 2019 విద్యా సంవత్సరంలో పదోతరగతిలో 9 గ్రేడ్ పాయింట్లకుపైగా వచ్చినవారు, 7.5 గ్రేడ్ పాయింట్లకంటే ఎక్కువ వచ్చిన దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.
ఉపకార వేతనాలకు ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ చదువు కోసం ఏడాదికి రూ.6 వేలు, అనంతరం విద్యార్థి ప్రతిభ ఆధారంగా వారు ఎంచుకున్న పైచదువులకు రూ.10వేల
నుంచి రూ.60వేల వరకు ఇవ్వనున్నట్లు పేర్కొంది. జూన్ 30లోపు www.vidyadhan.org ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
CLICK HERE TO OFFICIAL WEBSITE
*🌴🦢🦢🦢🦢🦢🦢🦢🌴*
0 Response to "✍విద్యాదాన్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం"
Post a Comment