ప్రభుత్వ పరిధిలో ఉండేలా ఒకే ఏజెన్సీ ఏజెన్సీలకు ఇచ్చే కమీషన్,పన్ను కూడా ఉద్యోగుల వేతనంలో జమచేసే యోచన జీతాల్లో 20-25 శాతం పెరిగే అవకాశం కొత్త విధానంపై ఆర్థిక శాఖ కసరత్తు
అమరావతి, జూన్ 18(ఆంధ్రజ్యోతి): ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కొత్త విధానం తీసుకొచ్చేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ పరిధిలోనే ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి దాని ద్వారా వివిధ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయాలని భావిస్తోంది.
ఇందుకుగాను ఉద్యోగుల మొత్తం వేతనం నుంచి కొంత శాతమని నిర్ణయించి, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే కమీషన్ కింద ఆ ఏజెన్సీకి చెల్లిస్తుంది. ఈ ఏజెన్సీలో నమోదు చేసుకున్న నిరుద్యోగులకు వారి నైపుణ్యాన్ని బట్టి ఉన్నతస్థాయి శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు కూడా ఉండాలని భావిస్తున్నారు.
ఏదైనా శాఖలో ఖాళీలు ఏర్పడినప్పుడు ఈ ఏజెన్సీలో నమోదైన వారిని నియమించుకోవాలని ఆలోచిస్తున్నారు. ఈ ఏజెన్సీలో నమోదైన నిరుద్యోగుల వివరాలు ప్రైవేటు సంస్థలకు అందుబాటులో ఉంటాయి.
ప్రభుత్వమే ఏజెన్సీ ఏర్పాటు చేసి దానికి కమీషన్ చెల్లిస్తుండడం వల్ల ఉద్యోగులు ఏజెన్సీలకు కమీషన్ ఇచ్చే బాధలు తప్పనున్నాయి.
ఇప్పుడు ఏజెన్సీలు చెల్లిస్తున్న జీఎస్టీని కూడా ఉద్యోగుల వేతనాల్లో నుంచే చెల్లిస్తున్నారు.

0 Response to "ప్రభుత్వ పరిధిలో ఉండేలా ఒకే ఏజెన్సీ ఏజెన్సీలకు ఇచ్చే కమీషన్,పన్ను కూడా ఉద్యోగుల వేతనంలో జమచేసే యోచన జీతాల్లో 20-25 శాతం పెరిగే అవకాశం కొత్త విధానంపై ఆర్థిక శాఖ కసరత్తు"
Post a Comment