PAN Card: మీ పాన్ కార్డ్ యాక్టీవ్‌గా ఉందా? చెక్ చేయండి ఇలా

*♦PAN Card: మీ పాన్ కార్డ్ యాక్టీవ్‌గా ఉందా? చెక్ చేయండి ఇలా*


    

*🔹మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? అసలు ఆ పాన్ కార్డ్ యాక్టీవ్‌గానే ఉందా? ఇది తెలుసుకోవడం చాలా సులువు. మీరే ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. కంప్యూటర్ ఉంటే చాలు. మీ పాన్ నెంబర్‌ను వెరిఫై చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ ఈ అవకాశం కల్పిస్తోంది. దీన్నే పాన్ వెరిఫికేషన్ లేదా నో యువర్ పాన్ అంటారు.*


 *🔸ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో పాన్ వెరిఫికేషన్ చేయొచ్చు. మీ పాన్ నెంబర్ యాక్టీవ్‌గా ఉంటే ఏ సమస్యా లేదు. ఒకవేళ మీ పాన్ నెంబర్ యాక్టీవ్‌గా లేకపోతే లావాదేవీల్లో సమస్యలు వస్తాయి. లేదా మీరు క్రెడిట్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ కోసం దరఖాస్తు చేసుకుంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశముంది.*



*🍁ఆన్‌లైన్‌లో పాన్ వెరిఫికేషన్ చేయండి ఇలా...*


*🔸ముందుగా ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ incometaxindiaefiling.gov.in ఓపెన్ చేయండి.*


*🔹ఎడమవైపు లిస్ట్‌లో Verify your PAN details ట్యాబ్ పైన క్లిక్ చేయండి.*


*🔸కొత్త పేజీలో మీ పాన్ నెంబర్, పూర్తి పేరు, పుట్టిన తేదీతో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.*


*🔹చివరగా సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే మీ పాన్ యాక్టీవ్‌గా ఉందో లేదో తెలుస్తుంది.*

CLICK HERE TO VERIFY PAN


*🔸ఒకవేళ మీ పాన్ డీయాక్టివేట్ అయినట్టయితే ఆదాయపు పన్ను శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీ పాత పాన్ కార్డ్ జిరాక్స్‌తో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే మీ పాన్ నెంబర్ యాక్టివేట్ చేస్తారు*

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "PAN Card: మీ పాన్ కార్డ్ యాక్టీవ్‌గా ఉందా? చెక్ చేయండి ఇలా"

Post a Comment