సీనియర్ నటుడు రాళ్లపల్లి కన్నుమూత.. 850పైగా చిత్రాల్లో

తెలుగు సినీ ప్రేక్షకులను ఐదు దశాబ్దాలకుపైగా ఆకట్టుకొన్న ప్రముఖ నటుడు, డ్యాన్స్ డైరెక్టర్ రాళ్లపల్లి ఇకలేరు. వృద్దాప్య సంబంధిత వ్యాధితో బాధపడుతూ శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో కూరుకుపోయింది. సుమారు 850పైగా చిత్రాల్లో నటించారు.

హైదరాబాద్‌లోని మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మరణించారు. ఆయన భౌతికకాయాన్ని తన నివాసానికి తరలిస్తాం అని కుటంబ సభ్యులు తెలిపారు.

రాళ్లపల్లి పూర్తిపేరు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు. సినీ పరిశ్రమలో ఎన్నో అవార్డులు అందుకొన్నారు. రాష్ట్ర నంది పురస్కారాన్ని మూడుసార్లు అందుకొన్నారు

అలాగే 1976లో ఊరుమ్మడి బతుకులు చిత్రంలో అద్భుతమైన ప్రతిభకు ఉత్తమ కామెడీ నటుడిగా జాతీయ అవార్డును అందుకొన్నారు. గణపతి అనే సీరియల్‌లో ఉత్తమ సహయనటుడిగా నంది అవార్డును పొందారు.

కుక్కకాటుకు చెప్పుదెబ్బ చిత్రంతో రాళ్లపల్లి నట జీవితాన్ని ప్రారంభించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సీనియర్ నటుడు రాళ్లపల్లి కన్నుమూత.. 850పైగా చిత్రాల్లో"

Post a Comment