ఏపీలో మరో 12 కొత్త జిల్లాలు .. ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్న అధికారులు
. ఇక ఎన్నికల్లో అధికారం హస్తగతం చేసుకున్న జగన్ హామీ నెరవేర్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా మార్చేందుకు అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు.
వైసీపీ ఎన్నికల హామీపై కసరత్తు ప్రారంభించామని, జగన్ ప్రమాణ స్వీకారం చేయగానే ఈ ఫైల్ ముందుకు కదులుతుందని ప్రభుత్వ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది
ఇక కొత్తగా రానున్న 12 జిల్లాలు చూస్తే
అనకాపల్లి (విశాఖ జిల్లా), అరకు (విశాఖ జిల్లా), అమలాపురం (తూర్పు గోదావరి), రాజమండ్రి (తూర్పు గోదావరి), నరసాపురం (పశ్చిమగోదావరి), విజయవాడ (కృష్ణా జిల్లా), నర్సరావుపేట (గుంటూరు జిల్లా), బాపట్ల (గుంటూరు జిల్లా), తిరుపతి (చిత్తూరు జిల్లా), రాజంపేట (కడప జిల్లా),నంద్యాల (కర్నూలు జిల్లా), హిందూపురం (అనంతపురం జిల్లా) అని తెలుస్తుంది.
కొత్త జిల్లాల ఏర్పాటుపై అధికారిక ప్రకటన ఇప్పుడప్పుడే వెలువడే పరిస్థితి లేనప్పటికీ, ఫైళ్లు మాత్రం చకచకా కదులుతున్నాయని తెలుస్తోంది. పరిపాలనా సౌలభ్యం కోసమే జగన్ తెలంగాణా రాష్ట్రం తరహా చిన్న జిల్లాల వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది
0 Response to "ఏపీలో మరో 12 కొత్త జిల్లాలు .. ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్న అధికారులు"
Post a Comment